Secretariat inauguration postponed: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిన ప్రభుత్వం. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 27, 2019న కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. నాలుగేళ్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఈ సచివాలయం రూ. 610 కోట్ల వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ కొత్త సచివాలయాన్ని ఈ ఏడాది జనవరి 18న ప్రారంభించాల్సి ఉండగా.. పెండింగ్ పనుల కారణంగా సచివాలయం ప్రారంభం ఫిబ్రవరి 17కి వాయిదా పడింది.ఈరోజు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడడం చర్చకు దారితీసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
Read also: Formula-E: దుమ్ము రేపనున్న రేసర్లు.. హోరెత్తనున్న సాగర తీరం
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల అయింది. ఏపీలో 13, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఫిబ్రవరి 27. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉండనుంది. అయితే ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడటంతో సంచలనంగా మారింది.
Amit Shah: నేడే ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి