NTV Telugu Site icon

Lok Sabha Results 2024: రెండో రౌండ్​లో నిజామాబాద్​ లో బీజేపీ.. ఖమ్మంలో కాంగ్రెస్

Nizamabad Khammam

Nizamabad Khammam

Lok Sabha Results 2024: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్​లో నిజామాబాద్​ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజలో వున్నారు. నిజామాబాద్​ రెండో రౌండ్​ ముగిసేసరికి 23, 936 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజలో వున్నారు.

ఖమ్మంలో 1.26 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి 1.26 లక్షల ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రఘురామిరెడ్డి బీజేపీ అభ్యర్థులపై ముందంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

భువనగిరిలో తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో వుంది. భువనగిరిలో 9,800 ఓట్ల ఆధిక్యంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో వున్నారు. మహబూబ్‌నగర్‌లో 25,957 ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ ముందంజలో ఉన్నారు. చేవెళ్లలో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో వున్నారు. చేవెళ్లలో 14,169 ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

వరంగల్‌లో పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ ముందంజలో ఉన్నారు. కమలం పార్టీ తరపున పోటీ చేస్తున్న అరూరి రమేష్ 242 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తొలి రౌండ్‌లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Maharashtra: మహారాష్ట్రలో ఎన్డీయే, ఇండియా కూటమి హోరాహోరీ..