NTV Telugu Site icon

Heavy Rain: తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు..!

Rain

Rain

Heavy Rain: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు పేర్కొన్నారు.

Read Also: Road Accident : తమిళనాడులో చెట్టును ఢీకొన్న టూరిస్ట్ వాహనం.. ఆరుగురు మృతి

కాగా, ఈ అల్పపీడనం కారణంగా నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక, రేపు (గురువారం) తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు మరి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. దీంతో ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 27 వరకు ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.