NTV Telugu Site icon

Illegal abortion-: వరంగల్ లో అక్రమ అబార్షన్.. ఆసుపత్రులపై టాస్క్ ఫోర్స్ నజర్

Abrshan

Abrshan

illegal abortion-: అనధికార అబార్షన్‌, లింగ నిర్ధారణ చేయకూడదని అధికారులు ఎంత చెబుతున్న కొన్ని ఆసుపత్రుల్లో ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. లింగ నిర్ధారణతో అబార్షన్‌ లు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలాంటి వాటికి సహకరించబోమని అధికారులు చెబుతున్న అవి ఏమీ పట్టించుకోకుండా వైద్యులు వారిపని వారు చేసుకుంటూ వెళుతున్నారు. ఇటువంటి సంఘటలనకు కేరాఫ్‌ అడ్రస్‌ గా వరంగల్‌ మారడం కలకలం రేపుతున్నాయి. వరంగల్‌ ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ, అబార్షన్‌ లు ఎక్కువగా జరుగుతున్నయని అధికారుల దృష్టికి రావడంతో.. ఇలాంటి వారిపై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు దృష్టి పెట్టారు. వరంగల్‌ ఆసుపత్రులపై దాడి చేసి పలు వైద్యులను, ఆసుపత్రిసిబ్బందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Read also: Chicken : భార్యను చికెన్ వండమంటే వండలేదని అలిగి భర్త ఆత్మహత్య

వరంగల్ లో అక్రమ అబార్షన్ చేస్తున్న ఆసుపత్రులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టి పెట్టారు. గత 10 రోజులుగా పలు ల్యాబ్ లు లింగ నిధారణ చేస్తునట్లు గుర్తించారు. దీనికి కారకులైన ఆర్‌ఎంపీలను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. హన్మకొండ నర్సంపేట్ లో ఇద్దరు గైనకాలిస్టులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న పలు ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ఎంపి లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్ తో అక్రమ టెస్టులు చేస్తున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ అను అదుపులో తీసుకున్నారు. ఇక నర్సంపేట పట్టణంలోని ఓ వైద్యురాలిని శనివారం వరంగల్ టాక్స్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. నగరంలోని ప్రముఖ హాస్పిటల్ వైద్య సిబ్బందిని టాక్స్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నెక్కొండలో ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ ను అదుపులోకి విచారిస్తున్నారు పోలీసులు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌