Basara IIIT : ట్రిపుల్ ఐటీ మరో విద్యార్థి మృతి.. హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIIT Student Bablu suicide: అధికారుల నిర్లక్ష్యంతో నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కాగా, మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బాబ్లా అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాయ్స్ హాస్టల్-1లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. తోటి విద్యార్థులు వెంటనే తలుపులు పగులగొట్టి కిందకు దించారు. వెంటనే కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బబ్లూ మృతి చెందాడు. కాగా, బబ్లూ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో బబ్లూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read also: Tech Mahindra: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8000 మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
Also Read
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
అదే క్యాంపస్‌లో చదువుతున్న సోదరుడితో మధ్యాహ్నం వరకు మాట్లాడిన బబ్లూ ఆ తర్వాత కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇలా చేశాడా.. లేక డిప్రెషన్ వల్లా.. ర్యాగింగ్ లాంటిదేమైనా ఉందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయగా.. ఎదిగిన తమ కొడుకు పరాయివాడైపోవడంతో వారు గుండెలు బాదుకున్నారు. కాగా, నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ఐఐటీలో ఎంటెక్ విద్యార్థి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇప్పుడు డిప్రెషన్ కు గురై చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Ponguleti: తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ.. కాంగ్రెస్ ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలి..
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?