NTV Telugu Site icon

Basara IIIT : ట్రిపుల్ ఐటీ మరో విద్యార్థి మృతి.. హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య..!

Bablu Iiit Student

Bablu Iiit Student

IIIT Student Bablu suicide: అధికారుల నిర్లక్ష్యంతో నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కాగా, మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బాబ్లా అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాయ్స్ హాస్టల్-1లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. తోటి విద్యార్థులు వెంటనే తలుపులు పగులగొట్టి కిందకు దించారు. వెంటనే కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బబ్లూ మృతి చెందాడు. కాగా, బబ్లూ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో బబ్లూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read also: Tech Mahindra: ఐటీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. 8000 మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ

అదే క్యాంపస్‌లో చదువుతున్న సోదరుడితో మధ్యాహ్నం వరకు మాట్లాడిన బబ్లూ ఆ తర్వాత కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇలా చేశాడా.. లేక డిప్రెషన్ వల్లా.. ర్యాగింగ్ లాంటిదేమైనా ఉందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయగా.. ఎదిగిన తమ కొడుకు పరాయివాడైపోవడంతో వారు గుండెలు బాదుకున్నారు. కాగా, నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ఐఐటీలో ఎంటెక్ విద్యార్థి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇప్పుడు డిప్రెషన్ కు గురై చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Ponguleti: తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ.. కాంగ్రెస్‌ ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలి..