Traffic Challan: ఇప్పుడు దేశవ్యాప్తంగా చట్టాలు కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనంపై బయటకు వెళ్లాలంటే డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ వంటి ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పొరపాటున ఇంట్లో మర్చిపోతే చలాన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే కొన్ని సందర్భాల్లో అదే విషయాన్ని గుర్తుపెట్టుకుని వాటిని ప్రతిసారీ తీసుకెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. ఈ క్రమంలో ఓ చిన్న పని చేస్తే ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్ల నుంచి శాశ్వతంగా తప్పించుకోవచ్చు. ఆ పత్రాలు తీసుకోకుండానే దేశం అంతటా సంతోషంగా ప్రయాణించవచ్చు. ఎలా అంటారా? అయితే ఇది మీకోసమే.
Read also: Gidugu Rudraraju: అప్పుడే రంగంలోకి దిగిన కొత్త పీసీసీ చీఫ్.. ఆ అంశాలపై చర్చ
అన్నింటి కంటే మొదటిది మీకు స్మార్ట్‌ఫోన్ చాలా అవసరం. స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి సర్టిఫికెట్లను ఆ యాప్‌లలో డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డౌన్‌లోడ్ చేసిన సాఫ్ట్ కాపీలు చెల్లుతాయి. పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆ సాఫ్ట్‌కాపీలు చూపిస్తే సరిపోతుంది. హార్డ్ కాపీలు తీసుకోకుండా సాఫ్ట్ కాపీలను ఉపయోగించడం ద్వారా దేశమంతటా ప్రయాణించవచ్చు. చలాన్లు అస్సలు పడవు. రోడ్డు, రవాణా శాఖ మంత్రిత్వ శాఖ 2018లోనే ఈ నిర్ణయం తీసుకుంది. డిజిలాకర్, ఎంపరివాహన్ యాప్‌లలో సేవ్ చేసిన సర్టిఫికెట్లను ఒరిజినల్ డాక్యుమెంట్లుగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది.
Himachal Pradesh: సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రియాంకదే తుది నిర్ణయం!
