Hameed wife: మధ్య ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీస్ లు జగద్గిరిగుట్ట అహ్మద్ నగర్ లోని మహ్మద్ హమీద్ ఇంటి పై దాడి చేశారు. ఇంట్లోని రెండు గదుల్లో టీమ్స్ సోదాలు జరిపింది. కౌంటర్ ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ పోలీస్ ల సాయంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్స్ దాడులు నిర్వహించారు. మహ్మద్ హమీద్ నివాసం లో ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్ పోర్ట్ తో పాటు కొన్ని ఉగ్రవాదానికి సంబంధించిన పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
అయితే మహ్మద్ హమీద్ భార్య హమీదా బేగం ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త ను అన్యాయంగా అరెస్ట్ చేశారని వాపోయింది. తెల్లవారు జామున పోలీస్ లు మా ఇంటికి వచ్చారని తెలిపింది. నా భర్త హమీద్ కూడా పోలీస్ లతో పాటే వచ్చారని వివరించింది. ఇల్లంతా చిందర వందర చేశారని పేర్కింది. మొత్తం వెతికి కొన్ని పుస్తకాలు, ఆధార్ కార్డ్ , పాస్ పోర్ట్ ను తీసుకెళ్లారని తెలిపారు. నా భర్త కు భోపాల్ తో ఎలాంటి సంబంధాలు లేవని వాపోయింది. నా భర్త కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. పోలీస్ లు నా భర్తను ఎలా తీసుకెళ్లారో.. అలాగే అప్పగించాలని డిమాండ్ చేశారు. బాంబ్ తయారు చేశాడు అంటున్నారు మరి బాంబులు ఇంట్లో వుంటే రాత్రికి రాత్రే బాంబులు ఎక్కడ పడేస్తామని ప్రశ్నించారు. హైదరాబాద్ లో నా భర్త కు ఎవరితోనూ పరిచయాలు లేవని అన్నారు. నన్ను పిల్లలను ఇంట్లో వుంచి బయట నుండి తాళం వేసి వెళ్ళేవాడని పేర్కొన్నాడు. అది కేవలం పిల్లల భద్రత కోసమే అని స్పష్టం చేశారు. హమీద్ స్నేహితుల గురించి నాకు ఏమీ తెలియదని అన్నారు. నా భర్త హమీద్ కొన్ని సార్లు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేశాడని కానీ .. వెళ్ళలేకపోయాడని మహీద్ భార్య తెలిప్పారు.
ఇక మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్ లో ఎన్ఐఏ పోలీసులు దాడులు నిర్వహించారు. సల్మాన్ అనే వ్యక్తిని ఐ.ఎస్.ఐ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. గత ఆరు సంవత్సరాల నుండి సల్మాన్ జవహర్ నగర్ లో వెల్డింగ్ కూలి పని చేసుకుంటూ నివసిస్తున్నాడని గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Lotus Pond Hyderabad: చేపలు చస్తున్నాయ్.. వాసనకు ముక్కులు పోతున్నాయ్