Site icon NTV Telugu

IBomma Ravi : ఐ బొమ్మ రవిపై మరో కేసు.. 14 రోజుల రిమాండ్..

Ibomma Ravi

Ibomma Ravi

IBomma Ravi : గత కొన్ని రోజులు హాట్ టాపిక్ గా మారిని ఐబొమ్మ రవి వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐ బొమ్మ వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రవిపై కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రవిని మరో కేసుతో సంబంధించి పీటీ వారెంట్ పై అరెస్టు చేసి, నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.

100W ఛార్జింగ్, OLED డిస్ప్లేలు, Bose స్పీకర్లతో Poco F8 సిరీస్ గ్లోబల్ లాంచ్..!

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కొత్త కేసు విచారణలో భాగంగా పోలీసులు రవిని పీటీ వారెంట్ ద్వారా కస్టడీకి తీసుకొని మొదట 9వ మెజిస్ట్రేట్ ముందు, అనంతరం 8వ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు రవికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రవిని మళ్లీ చంచల్ గూ జైలుకు తరలించారు. ఐ బొమ్మ రవిపై ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటి దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండవసారి 7 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఈ కస్టడీ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవ్వనుంది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా.? పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది.

Exit mobile version