NTV Telugu Site icon

Malla Reddy: నేను క్యాసినో నడిపించట్లేదు, కాలేజీ నడిపిస్తున్నా..

Minister Malla Reddy

Minister Malla Reddy

Malla Reddy: నేను క్యాసినో నడిపించట్లేదు, కాలేజీ నడిపిస్తున్నానని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. ఐటీ రైడ్ చేశారు, నేను భయపడలేదన్నారు. 400 మంది వచ్చారు, వాళ్ల పని వాళ్ళు చేసుకుని వెళ్లారని తెలిపారు. మేము బయపడము, 33 కాలేజీలు నడిపిస్తున్న, నాది సింపుల్ లైఫ్.. హై థింకింగ్ అన్నారు మల్లారెడ్డి. 300 గజాల స్థలంలో నా ఇల్లు ఉందన్నారు. వందల మంది డాక్టర్స్.. ఇంజనీర్లు తయారు చేస్తున్నాఅని అన్నారు. అందుకే చిన్న ఇంట్లో ఉంటున్న అని తెలిపారు. నా కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేను, అంతా ఆన్లైన్ అడ్మిషన్స్ అని అన్నారు మంత్రి మల్లా రెడ్డి. కల కన్నా.. నిజం చేసుకున్న.. నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరని అన్నారు. మెడికల్ కాలేజీ కట్టి .. ఆరేళ్ళు నష్టపోయిన ఇబ్బంది పడ్డా అని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్ళకి, వేరే పార్టీ అని అనుమతి ఇవ్వలేదని అన్నారు.

Read also: Andhra Pradesh: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు

రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నానని అన్నారు. బ్లాక్ మెయిలర్స్ ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఎంబీబీఎస్ బ్యాచ్ లు రాకుండా రాజకీయ బ్లాక్ మెయి లైర్స్ చేశారని అన్నారు. తుఫాన్ లు వచ్చినా తట్టుకుంటా అనే దైర్యం వచ్చిందని తెలిపారు. పాల వెండర్ గా ఈ స్థాయికి వచ్చినా అని పేర్కొన్నారు. ఫారిన్ ఫండ్స్ రాలేదని, కష్టపడ్డా సాధించా అన్నారు మంత్రి. కేసీఆర్‌ నాకు యునివర్సిటీ ఇచ్చారని, డబ్బులు ఉంటే బిల్డింగ్స్ కట్టొచ్చు కానీ మంచి ప్రొఫెసర్స్ రారని మల్లరెడ్డి అన్నారు. గాంధీ, ఉస్మానియా తరవాత మా కాలేజీనే అంటూ పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ కష్టపడితే ఎంబీబీఎస్ పాస్ ఐనట్టే అని తెలిపారు. మెడికల్ కాలేజీలో డొనేషన్స్ లేవని, అంతా ఆన్లైన్ అడ్మిషన్స్ అన్నారు.

Read also: JP Nadda: దక్షిణాదిపై ఫోకస్‌.. మరోసారి తెలంగాణకు జేపీ నడ్డా..

తన కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేనని అన్నారు. బర్త్ డే లు పిక్నిక్స్ ఉండొద్దనిచ పిల్లలను పాడు చేసేది పేరెంట్స్ అని అన్నారు. కొన్ని సాధించాలి అంటే కొన్నింటికి దూరం ఉండాలని తెలిపారు. ప్రేమ.. ఫ్రెండ్‌ షిప్‌ అన్నిటికీ దూరం ఉండాలని పేర్కొన్నారు. నేను ఏది దాచుకోను, భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చేపించా అన్నారు మల్లారెడ్డి. ఎంపీ, ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి అయ్యానని అన్నారు. నాకు ఎలాంటి కోరికలు లేవని స్పష్టం చేశారు. ఒక డాక్టర్ ను చదివిస్తే కోడలుగా మరో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చిందని అన్నారు. రెడ్డి అమ్మాయిని చేసుకుంటే కిట్టి పార్టీలు, పిక్నిక్ లు వెళ్ళేదని సంచళన వ్యాఖ్యలు చేశారు. నా కోడలుకు అమ్మ నాన్న లేరు, నాకు కోడలు మూడో కొడుకు లాగా అని మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యానించారు.

Read also: Kurnool Live: కర్నూలులో రాయలసీమ గర్జన లైవ్ అప్‌డేట్స్

మల్లా రెడ్డి మెడికల్ కాలేజీ డైరెక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. మా కాలేజీ పై చాలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అడ్మిషన్స్ పారదర్శకంగా చేస్తున్నామని తెలిపారు. ఆరోపణలపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులే మా కాలేజీని ప్రియారిటీగా ఎంచుకుంటున్నారని తెలిపారు. అన్ని అడ్మిషన్స్ ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. మా బంధువులకు కూడా మేము మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ఇవ్వలేమన్నారు. పైకి వెల్లేకొద్ది ఇలాగా హై లైట్ కావడం సహజమన్నారు.
Bedurulanka 2012: ‘చిత్ర’గా మారిన ‘రాధిక’