Site icon NTV Telugu

HYDRA : ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన హైడ్రా..

Hydra

Hydra

HYDRA : దుండిగల్ చెరువులో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హైడ్రా DRF సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. కుటుంబ కలహాలతో మానసిక ఆవేదనకు గురైన రహీం అనే వ్యక్తి చెరువులో దూకి తన ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు. గణేశ్ నిమజ్జన డ్యూటీలో భాగంగా చెరువు వద్ద మోహరించిన హైడ్రా విభాగానికి చెందిన విపత్తు నిర్వహణ సిబ్బంది ఈ ఘటనను గమనించి వెంటనే నీటిలోకి దూకి రహీంను రక్షించారు. ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడిన రహీంను అనంతరం బయటకు తీసుకువచ్చి చికిత్స అందించారు. తరువాత రహీంను ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. సమయానికి అప్రమత్తంగా వ్యవహరించిన హైడ్రా DRF బృందం చర్యలకు స్థానికులు ప్రశంసలు కురిపించారు.

Super Six – Super Hit Meeting: సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష..

Exit mobile version