NTV Telugu Site icon

Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల 17,18న వైన్స్ బంద్..

Wine Shops Close

Wine Shops Close

Wine Shops Close: ప్రస్తుతం హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న వినాయ చవితి పండుగ నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గణేషుడు నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం షాపులు మూసి వేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..

సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు , బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని సీవీ ఆనంద్ ఉత్తర్వూలు జారీ చేశారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ కి ఇది వర్తించదని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీన ఖైరతాబాద్ వినాయకుడితో సహా నగరంలోని వివిధ గణేషుడి విగ్రహాలు నిమర్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాంత్రి భద్రతలకు భంగం కలగకుండా, ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నగరంలోని అన్న మద్యం, కల్లు దుకాణాలు మూసేవేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968లోని సెక్షన్ 20 కింద జారీ చేసిన ఈ ఉత్తర్వు జారీ చేశామని తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించి.. షాపులు ఓపెన్ చేస్తే..కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
Danam Nagender: బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇళ్లే దొరికిందా..?