NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

* నేడు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. ఇవాళ ఉదయం 11గంటలకు సమావేశం..

* నేడు హైదరాబాద్ లో కిసాన్ అగ్రి షో 2025.. ఈ నెల 9 వరకు హైటెక్స్ లో సదస్సు.. మూడు రోజుల పాటు భారీ వ్యవసాయ ప్రదర్శన.. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై చర్చ.. పాల్గొననున్న 150కి పైగా కంపెనీల ప్రతినిధులు..

* నేడు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నామినేషన్.. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్.. కలెక్టరేట్ లో నామినేషన్ వేయనున్న అంజిరెడ్డి..

* నేడు వైసీపీలోకి శైలజానాథ్.. జగన్ సమీక్షంలో పార్టీలో చేరనున్న శైలజానాథ్..

* నేడు గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్.. ఉదయం 10గంటలకు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ..

* నేడు అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) 22వ రాష్ట్ర మహాసభలు.. హాజరుకానున్న AIYF జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కె.రామకృష్ణ..

* నేడు మాజీ మంత్రి వివేక డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదుపై విచారణ.. వివేక హత్య కేసు విచారణ చేపట్టిన సీబీఐ రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ తనను బెదిరించారని దస్తగిరి ఫిర్యాదు..

* నేడు భోగాపురం మండలం నందిగాము గ్రామంలో శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం జరుగును..

* నేడు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ.. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో గత నవంబర్ లో వర్మపై కేసు నమోదు.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించిన కోర్డు..

* నేడు రాత్రి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కల్యాణం.. లక్ష్మీ నరసింహస్వామి కల్యాణానికి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.. గోదావరి జిల్లాల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులు.. దివ్య కల్యాణం అనంతరం భక్తులకు అక్షింతలు పంపిణీ..

* నేడు అనపర్తిలోని కొత్తూరు ప్రభుత్వ కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన విఘ్నేశ్వరుడు ఆలయంలో విగ్రహ ప్రతిష్ట నిలిపివేయాలని నోటీసులు జారీ.. ఎటువంటి అల్లర్లు జరగకుండా కొత్తూరు గ్రామంలో 144 సెక్షన్ అమలు..

* నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని మోడీ అధ్యక్షుడు కేబినెట్ భేటీ..

* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 79,310.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 86,520.. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 1,06,900..