NTV Telugu Site icon

Murali Mohan: హైడ్రా అవసరం లేదు.. మేమే కూల్చేస్తాం.. నోటీసులపై మురళీమోహన్..

Murali Mohan

Murali Mohan

Murali Mohan: హైడ్రా అధికారుల నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానన్న మురళీమోహన్.. తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారని తెలిపారు. అందుకు హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం ఏమీ లేదని.. ఆ షెడ్డును తామే కూలుస్తామని స్పష్టం చేశారు. కాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (FTL), బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మురళీమోహన్ స్పందించారు.

Read also: Karimnagar: అసలే కోతులు.. కంగారు పెట్టి చివరకు నవ్వించిన ఘటన..

తాజాగా ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ జయభేరి సంస్థకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. హైదరాబాద్‌లోని రంగలకుంట చెరువులో జయభేరి సంస్థకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులులో పేర్కొన్నారు. లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో తెలిపారు. కాగా.. ఫైనాన్షియల్‌ జిల్లాలోని రంగళాల్ కుంట చెరువులోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలను తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే హైడ్రా జారీ చేసిన నోటీసులపై జయభేరి సంస్థ ఇంకా స్పందించలేదు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌ను హైడ్రా కూల్చివేసి దుర్గంచెరువు బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Tirupati Laddu: టీటీడీ అన్ని ఆలయాల్లో తిరుపతి లడ్డూలు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే..

Show comments