Site icon NTV Telugu

Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. బీఆర్‌ఎస్‌, బీజేపీ… బీసీ ద్రోహులు..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాడేది తాము మాత్రమేనని, ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.. బీఆర్ఎస్‌, బీజేపీ. బలహీనవర్గాల ద్రోహులు అని మండిపడ్డారు.. గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, ఈ పరిమితిని అధిగమించేందుకు ప్రభుత్వం సేకరించిన డాటా, నివేదికలు ఆధారంగా కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు.

Read Also: Telangana High Court: సిగాచీ పేలుళ్ల ఘటన… పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

అసలు BRS కోర్టులో ఇంప్లీడ్ ఎందుకు కాలేదు? అని పొన్నం ప్రశ్నించారు.. సిగ్గులేకుండా బయట విమర్శలు చేసే బీఆర్ఎస్ నాయకులు కోర్టులో మాత్రం లేరు అని మంత్రి ఆరోపించారు. కోర్టులో రిజర్వేషన్ నిలిపేస్తే బీఆర్ఎస్ నేతలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. అటు.. బీసీ రిజర్వేషన్ల అమలులో అడ్డంకులు తొలగించేందుకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేయడం లేదా? అని ప్రశ్నించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 42% రిజర్వేషన్లతోనే జరపాలన్న ఆలోచన ఉందని తెలిపారు పొన్నం.. ఇక బీసీ సర్వేలో పాల్గొనని పార్టీలకు మాట్లాడే నైతిక హక్కు లేదని పొన్నం తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంటే గంటల్లో బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేదన్న ఆయన.. మేము కోర్టులో చేస్తున్న పని మీకూ తెలుసు. తెలిసీ మాపై ఆరోపణలు చేయొద్దు. సలహాలు ఇవ్వండి.. తీసుకుంటాం.. కానీ, రాజకీయ పార్టీల ఒత్తిడికి లోనవ్వొద్దు అని సచించారు.. బీజేపీ–బీఆర్ఎస్ బీసీ ద్రోహులు అని మండిపడ్డారు పొన్నం.. బలహీన వర్గాల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్యాయం చేశాయని తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగం ఏం చెబుతుందో తెలియకపోతే తెలుసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో వారికి హక్కుగా రిజర్వేషన్ ఇవ్వాలి.. బీసీ సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదం.” అని వ్యాఖ్యానించారు.

Exit mobile version