హైదరాబాద్ హైటెక్స్ లో స్కూల్ లీడర్‌షిప్ సమ్మిట్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ను మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎంపీగా ఉన్నప్పుడు నాటి మంత్రి స్మృతి ఇరానీ గారితో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చర్చించాం.. కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఎడ్యుకేషన్ పాలసీ గురించి మా సూచనలు తెలియజేసాం.. కొన్ని రాష్ట్రాలలో మాతృ భాషలో పరీక్షల నిర్వహన గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి.. నీట్ వంటి పరీక్షల విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి.. న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు.. ఈ రెండు రోజుల సమ్మిట్లో మీ సమస్యలు, మీ ఆలోచనలు అన్నిటినీ ఓ నివేదికగా ఇవ్వండి.. విద్యాశాఖ మంత్రిగారితో కలిసి, కేంద్రానికి నివేదిక ఇద్దామని ఆయన అన్నారు.
ఫలానా స్కూల్స్ కి వెళ్తే మా పిల్లోడు బాగా చదువుతాడు అనే నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించాలి.. రాబోయే కాలంలో మన దేశ జనాభాకి సరిపడా స్కూల్స్ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.. మనకు కావాల్సింది నాణ్యమైన విద్యా.. అన్నిట్లో ముందున్నాం, కానీ ఎడ్యుకేషన్ లో కొంత మెరుగైన ప్రణాళికలు అవరసం.. కొందరు పిల్లలు తెలుగులో పేర్లు కూడా రాయలేకపోతున్నారు.. రాబోయే విద్యా సంవత్సరంలో అన్ని స్కూల్స్ అద్భతంగా తయారవుతాయి.. విద్యార్థుల భవిష్యత్ అద్భుతంగా తయారవుతుంది.. రాబోయే తరాలకు ఉన్నత విలువలు కలిగిన విద్యను అందించడమే మన లక్ష్యమని ఆయన అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఎస్‌ఏ, ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు.
