Hyderabad Water: హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేయనున్నారు. 4వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి శుక్రవారం 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు రిజర్వాయర్లలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. షేక్‌పేట, భోజగుట్ట రిజర్వాయర్ (లోప్రెసర్), జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నల్గండ్ల, చందానగర్, హుడాకాలనీ, హఫీజ్‌పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ రెండు రోజులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు కోరారు.
Read also: Plastic Cover in Biryani: చికెన్ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
తాజాగా.. జూన్ 26, బుధ, 27వ తేదీల్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫేజ్-2 తాగునీటి సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (HMWSSB) ప్రభావిత ప్రాంతాల నివాసితులకు నీటిని పొదుపుగా ఉపయోగించాలని సూచించింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2 గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నీటిని అందిస్తోంది. అయితే కొండాపూర్ పంప్ హౌస్ లోని రెండో పంపు ఎన్ ఆర్ వీ వాల్వ్ అనూహ్యంగా మరమ్మతులకు గురికావడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనితో NPA, మీర్ ఆలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, అల్లబండ, మేకలమండి, భోలక్‌పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బుద్ధనగర్, తదితర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ 4, 5 తేదీల్లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రజలు మండిపడుతున్నారు. రెండు వారాలకు ఒకసారి నీటిని బంద్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Darling: బాగ్స్ ప్యాక్ చేసుకుని పదండి అంటున్న హీరోయిన్