Water Supply: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ ప్రకటించింది. కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్ 1 కింద ప్రశాసన్ నగర్, అయ్యప్ప సొసైటీ మధ్య మంచి నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైన్ పలు ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడింది. దీంతో హకీంపేట, గోల్కండ, టోలీచౌక్, లంగర్ హౌజ్, షేక్ పేట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, తాటి ఖానా, కొండాపూర్, డోయెన్స్ కాలనీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు. ప్రశాసన్‌నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు 1200 డయా పీఎస్‌పీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ చాలా చోట్ల లీకేజీలు ఏర్పడినట్లు పేర్కొంది. దీంతో సోమవారం పైపులైన్ మరమ్మతు పనులు చేపడతామని చెప్పారు. సోమవారం ఉదయం 6.00 గంటల నుంచి 24 గంటల పాటు అంటే మంగళవారం ఉదయం వరకు మరమ్మతు పనులు కొనసాగుతాయని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు మంచినీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని వాటర్ వర్క్ అధికారులు సూచించారు. మళ్లీ యదావిధిగానే మంగళవారం ఉదయం నుంచి నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
Hydra Focus: హడలెత్తిస్తున్న హైడ్రా.. నేడు గుట్టల బేగంపేట్ పరిధిలో కూల్చివేతలు..!
Water Supply: నగరంలో 24 గంటల పాటు నీటి సరఫరా బంద్..
- భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు..
- ప్రకటించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్..
Show comments