Site icon NTV Telugu

జైపాల్‌రెడ్డి కేంద్ర మంత్రి గా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారు : వీహెచ్‌

VH

VH

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి 80వ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని స్పూర్తి స్థల్‌లో కాంగ్రెస్‌ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్న అందరితో కలిసి మెలిసి జైపాల్ రెడ్డి పని చేశారని, జైపాల్ రెడ్డి లేకపోవడంతో దేశానికి చాలా లోటని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు.

నిత్యం పార్టీ, దేశం కోసం ఆలోచించే వారని ఆయన అన్నారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లడుతూ.. జైపాల్ రెడ్డి ఒక మహా నాయకుడు, దేశ రాజకీయాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలక పాత్ర వహించారని, పార్లమెంట్‌లో జైపాల్ రెడ్డి మాట్లాడితే డిక్షనరీ చూసుకునే వారన్నారు.

Exit mobile version