Site icon NTV Telugu

V. Hanumantha Rao: కంగనా ను కంట్రోల్ చేయండి.. బీజేపీ కి వీహెచ్‌ సూచన..

Kangana

Kangana

V. Hanumantha Rao: కంగనా రనౌత్ ను బీజేపీ కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావ్ మండిపడ్డారు. కంగనా రనౌత్.. రాహూల్ గాంధీ నీ తిట్టి తప్పు చేసిందన్నారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడి పాపులర్ కావాలని చూస్తుందన్నారు.
రాహుల్ గాంధీ పై కంగనా మాటలకు మాకు బాధను కలిగించాయన్నారు. అంబర్ పేట లో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎవరి గురించి.. ఏం మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు. రైతుల కు వ్యతిరేకి.. కంగనా అంటూ మండిపడ్డారు.

Read also: Second Marriage: భార్య మంచి మనసు.. దగ్గరుండి భర్తకు మరో యువతితో పెళ్లి..

రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే క్రమశిక్షణ ఉల్లంఘన కాదా..? అని ప్రశ్నించారు. కంగనా… సినిమా జీవితం లో ఎలా ఉన్నా.. నీకు రాజకీయాలు ఒంట పట్టలేదన్నారు. రాహుల్ గాంధీకి కంగనా క్షమాపణ చెప్పాలన్నారు. ఇక.. పేదలు చెరువుల్లో ఇండ్లు కట్టుకుంటే వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇవ్వాలన్నారు. స్మశాన వాటిక లు కూడా ఆక్రమించి ఇల్లు కడుతున్నారు..వాటిని కూడా ఆపాలి సీఎం అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్.. చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం తన కుటుంబ సభ్యుల ఇల్లు ఉన్నా.. కూలగొట్టండి అని చెప్పిన తర్వాత.. వేరే చర్చ అవసరం లేదన్నారు. అది అందరికీ ఒకే పద్ధతి అన్నారు.
Kavitha First Tweet: 165 రోజుల విరామం తర్వాత కవిత ట్విట్టర్ పోస్ట్ వైరల్‌..

Exit mobile version