NTV Telugu Site icon

Uttam Kumar Reddy: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే.. అధికారులకు మంత్రి వార్నింగ్..

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ జల సౌదలో రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ.. ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్ పాల్గొన్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాజెక్టులలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదన్నారు. నీటి పారుదల శాఖ కు నిధుల కేటాయింపులు బాగున్నాయి.. పనులు వేగవంతం చేయాలని తెలిపారు.

Read also: CM Revanth Reddy: సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం

క్షేత్ర స్థాయిలో పనులు లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలన్నారు. అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తయేలా చూసే బాధ్యత మీదే అన్నారు. ఎట్టి పరిస్థితులలో పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే.. పనులు మంచిగా పూర్తి చేసిన వారిని గుర్తిస్తామని, పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కమిట్మెంట్, సిన్సియర్టీ తప్పకుండా ఉండాలని తెలిపారు. ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లలు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పనులు బాధ్యతగా చేయాలి.. పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగాలననారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తలను వెంటవెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజా ధనం అత్యంత విలువైనది .. ప్రతి పైసా చాలా జాగ్రత్తగా వ్యయం చేయాలని అన్నారు. ఉన్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా పనులు చేయకుండా.. క్రమశిక్షణ గా పనులు చేసి టార్గెట్ పూర్తి చేయాలన్నారు.
Shamirpet Road Accident: శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..

Show comments