Real Estate: యువతిపై ఇద్దరు రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ ల అత్యాచార యత్నం..

  • యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల అత్యాచార యత్నం..
  • కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చి ఉప్పల్ లో ఉంటున్న యువతి..
  • సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి
  • జనార్దన్ హత్యాచారానికి యత్నం..
  • ఉప్పల్ పోలీసులను ఆశ్రయించిన యువతి..
Jsr Sun City Real Estate

Jsr Sun City Real Estate

Real Estate: ప్రభుత్వం మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జేఎస్‌ఆర్‌ సన్‌ సిటీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని అదే కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించిన ఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది.

Read also: Virat Kohli – MS Dhoni: కోహ్లీతో పాటు నన్ను కూడా ఇంటికి పంపండి.. ధోనీ గురించి పాక్ ప్లేయర్ ఏమన్నారంటే..?

కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్ లో స్థిరపడింది. మియాపూర్ లోని జేఎస్ ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ విభాగంలో ట్రైనీగా చేరింది. అయితే అదే రియల్‌ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు కన్ను ఆమెపై పడింది. అయితే సమయం కోసం వేచి చూసారు. ఆ సమయం రానే వచ్చింది. ఆమెను మాట మాట కలిపి సైట్ విజిట్ కోసం వెళ్లాలని చెప్పారు. అయితే వారి మాటలు నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందుకు కారులో ఎక్కింది. అయితే అప్పటికే వారి మాట్లలో ఏదో తేడాను గమనించింది.

Gold Rates Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

తోటి ఉద్యోగులే కదా ఏదో సరదాగా మాట్లాడుతున్నారంటూ లైట్ తీసుకుంది. అయితే సైట్ విజిట్ చేసేందుకు వెళ్లిన వారు ఆ ప్లేస్ వచ్చిందంటూ ఆమెను కిందకు దిగమన్నారు. కారునుంచి దిగుతున్న యువతిపై సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి, జనార్దన్ అత్యాచారానికి యత్నానికి పాల్పడ్డారు. అయితే అక్కడ గట్టిగా కేకలు వేసిన ఎవరూ లేకపోవడంతో చాకచక్యంగా వారిని నుంచి తప్పించుకున్న యువతి అదేరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఉప్పల్ పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేశారు. అక్కడి నుండి ఆ యువతి కేసును మియాపూర్ కు బదిలీ చేశారు. సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంగారెడ్డి, జనార్దన్ పరారీలో వున్నట్లు తెలుస్తుంది.
Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌