Site icon NTV Telugu

అత్తాపూర్‌లో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్‌.. రంగంలోకి కాప్స్‌..

రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఇద్దరు మైనర్ అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీగా మారింది. వేరు వేరు ప్రాంతాలలో ఇద్దరు విద్యార్థినీలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే టైలరింగ్ నేర్చుకోవడానికి ఓ విద్యార్ధిని వెళ్లగా స్కూల్ కు మరో విద్యార్ధిని వెళ్లింది. అయితే ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన విద్యార్థినీలు సాయంత్రం ఎంతకీ తిరిగి ఇంటికి చేరుకోలేదు.

దీంతో తల్లిదండ్రులు చుట్టూ పక్కల వెతికి, సమీప బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులను విద్యార్థినీల తల్లిదండ్రులు ఆశ్రయించారు. విద్యార్థినీల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Exit mobile version