NTV Telugu Site icon

Trains Cancellation: బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు

South Central Railway

South Central Railway

Trains Cancellation: ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలోని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌, వరంగల్‌ నుంచి హైదరాబాద్‌, కాజీపేట నుంచి బల్లార్ష రైళ్లు సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 30 వరకు రద్దయ్యాయి. సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబరు 1 వరకు బల్లార్ష నుంచి అక్టోబరు 1 వరకు, సిర్పూర్‌ టౌన్‌ నుంచి కరీంనగర్‌, కరీంనగర్‌ నుంచి బోధన్‌ రైళ్లు సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు రద్దయ్యాయి.

Read also: Manu Bhaker: షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌లో పాల్గొనడం లేదు.. మను భాకర్..

సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు బోధన్ టు కరీంనగర్, కాచిగూడ నుంచి నడికుడి, సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నడికుడి నుంచి కాచిగూడ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బుధవారం వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు హెచ్‌ఎస్ నాందేడ్ నుండి రాయచూర్ రైలు, తాండూరు నుండి రాయచూర్ వరకు తాత్కాలికంగా రద్దు చేయబడింది. అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్ష, సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రైళ్లకు కాజీపేటలో స్టాప్‌ను తొలగించారు.

Read also: Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..

ట్రైన్ నెంబర్లు ఇవే..

ప్రధానంగా సెప్టెంబరు 1 నుంచి 30 వరకు, సికింద్రాబాద్-వరంగల్ ఎంఈఎంయూ (07462), వరంగల్-హైదరాబాద్ ఎంఈఎంయూ (07463), కాజీపేట-బల్లార్ష (17035), సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1 నుంచి 3036 ఎంఈఎంయూ (07766), కరీంనగర్-బోధన్ ఎంఈఎంయూ (07766), బోధన్-కరీంనగర్ ఎంఈఎంయూ (07893) నవంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు, కరీంనగర్-సిర్పూర్ టౌన్ (07765), కాచిగూడ-నడికుడి (07791) నవంబర్ 1 నుంచి 30 వరకు, నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు హెచ్‌ఎస్. నాందేడ్-రాయచూర్ (17664) రైలు తాండూరు-రాయచూర్ మధ్య, రాయచూర్-పర్భాని (17663) రైలు రాయచూర్-తాండూరు మధ్య సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు పాక్షికంగా రద్దు చేయబడినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Chuttmalle: ట్రోలింగ్ సాంగ్ కు టన్నుల్లో రీల్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..