September 17: సెప్టెంబర్ 17న దేశంలో హైదరాబాద్ రాష్ట్ర విలీన వేడుకలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం అధికారికంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ తమ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9.30 కి జూబ్లీహిల్స్ నివాసం నుండి సీఎం రేవంత్ పబ్లిక్ గార్డెన్స్ బయలుదేరనున్నారు. గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించనున్న సీఎఎం . అనంతరం ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఎగరేయనున్నారు సీఎం. ఈ కార్యక్రమానికి జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Read also: Kolkata Doctor Case: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన మమతా బెనర్జీ.. కోల్‌కతా టాప్ కాప్ తొలగింపు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ జరుపుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనుండగా, మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేసే వారి వివరాలను పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. . అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో మూడేండ్ల జెండాను ఎగురవేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read also: Khairatabad Ganesh: మొదలైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభాయాత్ర..
మరోవైపు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొంటారు. ఉదయం 7.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ‘సెప్టెంబర్ 17 – హైదరాబాద్ విమోచన దినోత్సవం’ ప్రాముఖ్యతను వివరిస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారిచే చిన్న ప్రదర్శన ఉంటుంది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని.. గత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటోంది. ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే కార్యక్రమానికి వెళ్తాను’ అని బండి వెల్లడించారు.
Khairatabad Ganesh: నేడు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేష్..