NTV Telugu Site icon

V.C. Sajjanar: క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్ ఘటన.. సజ్జనార్ ట్వీట్ తో పది మందిపై కేసు..

Vc Sajjanaar

Vc Sajjanaar

V.C. Sajjanar: ఐటీ క్యాడర్లో బైక్ రైడర్స్ మరొకసారి రెచ్చిపోయిరు. హైటెక్ సిటీ టీ హబ్ మై హోమ్ భుజ ప్రాంతాలలో దీపావళి రోజు యువత బాణాసంచర్లను బైక్ పై పెట్టుకుని స్టంట్లు వేసింది. దీపావళి రోజు కొందరు పోకిరీలు వెర్రి చేష్టలు వేస్తూ.. క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్లు చేసింది. అంతే కాకుండా వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీంతో యువత తీరుపై ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా Xలో వీడియోలు పోస్ట్ చేశారు. దీపావళి అనేది వినోదం మరియు ,ఉత్సాహం,ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజరి తెలిపారు. ఇలా.. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

యువకుల అసాంఘిక పోకడలు, వీధుల్లో, రైళ్లలో డ్యాన్స్‌లు, సెల్ఫీలు, రీళ్లతో క్రాకర్స్‌తో విన్యాసాలు చేసిన బైక్‌ రైడర్లపై కేసులు పెట్టారు. ట్విట్టర్‌లో తరచూ స్పందించే సజ్జనార్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలతో వైరల్‌గా మారింది. దీంతో రాయదుర్గం పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ రైడర్స్ లపై కేసు నమోదు చేశారు. సుమారు 10 మందిని అదుపులో తీసుకుని పది బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. గత రెండున్నర నెలల్లో 250 పైచిలుకు బైకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 250 మందిపై కేసులు పెట్టిన యువత ఆగడాలు మాత్రం మారడం లేదని అన్నారు. ఐటీ క్యాడర్లలో స్టంట్ లు బైక్ రైసింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Arvind Dharmapuri: కేటీఆర్ ది పాదయాత్రనా? లేక పదవుల యాత్రానా?.. అరవింద్ కీలక వ్యాఖ్యలు..