NTV Telugu Site icon

Balapur Laddu: 1994 నుంచి 2024 వరకు.. బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే..

Ganesh Balapur

Ganesh Balapur

Balapur Laddu: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే.. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ రూ.30 లక్షల వెయ్యి రూపాలయకు కొలను శంకర్‌ రెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ బరువు 21 కిలోలు. 1980లో ప్రారంభమైన సంప్రదాయాన్ని ఇప్పటికీ నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. 1994లో తొలిసారిగా లడ్డూ వేలం నిర్వహించగా.. అప్పట్లో ధర రూ.450. అప్పటి నుంచి ఏటా రికార్డు ధరలతో లడ్డూ ప్రసాదం వందల రూపాయల నుంచి లక్షల రూపాయలకు చేరింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.27 లక్షలకు పెరిగింది. గతేడాది ఈ భారీ లడ్డూను స్థానికేతరుడైన దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది ఏకంగా రూ.30 లక్షలు ధర పలకడం విశేషం.. అయితే అప్పటి (1994) నుంచి ఇప్పటి (2024) వరకు ఎవరెవరు ఈ బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారో తెలుసా..

Read also: Kishan Reddy: వక్ఫ్ బోర్డు బిల్ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

లడ్డూ వేలం-విజేతలు వీరే..

* 1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450
* 1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500
* 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు
* 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు
* 1998లో కొలన్‌ మోహన్‌ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు
* 1999 కళ్లెం ప్రతాప్‌ రెడ్డి- రూ.65 వేలు
* 2000 కొలన్‌ అంజిరెడ్డి- రూ.66 వేలు
* 2001 జీ. రఘనందన్‌ రెడ్డి- రూ.85 వేలు
* 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000
* 2003లో చిగిరినాథ బాల్‌ రెడ్డి- రూ.1,55,000

Read also: Bandi Sanjay: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచలోనే 5వ స్థానానికి చేర్చిన ఘనత మోడీ దే..

* 2004లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.2,01,000
* 2005లో ఇబ్రహీ శేఖర్‌- రూ.2,08,000
* 2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు
* 2007లో జీ రఘనాథమ్‌ చారి- రూ.4,15000
* 2008లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.5,07,000
* 2009లో సరిత- రూ.5,10,000
* 2010లో కొడాలి శ్రీదర్‌ బాబు- రూ.5,35,000
* 2011లో కొలన్‌ బ్రదర్స్‌- రూ.5,45,000
* 2012లో పన్నాల గోవర్ధన్‌ రెడ్డి- రూ.7,50,000
* 2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000
* 2014లో సింగిరెడ్డి జైహింద్‌ రెడ్డి- రూ.9,50,000
* 2015లో కొలన్‌ మధన్‌ మోహన్‌ రెడ్డి- రూ.10,32,000
* 2016లో స్కైలాబ్‌ రెడ్డి- రూ.14,65,000

Read also: GHMC Office: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..

* 2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు
* 2018లో తేరేటి శ్రీనివాస్‌ గుప్తా- రూ.16,60,000
* 2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు
* 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
* 2021లో మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌- రూ.18.90 లక్షలు
* 2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000
* 2023లో దాసరి దయానంద్‌ రెడ్డి- రూ.27 లక్షలు
* 2024లో కొలను శంకర్‌ రెడ్డి- రూ. 30 లక్షల వెయ్యి రూపాలయకు దక్కించుకున్నారు.

Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..?

Show comments