NTV Telugu Site icon

Arunachalam: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జులై 19 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు..

Tgrtc

Tgrtc

Arunachalam: తెలంగాణ నుంచి అరుణాచలం ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 19 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఉంటాయని తెలిపింది.

Read also: VJ Sunny: సెలూన్ బిజినెస్‌లోకి బిగ్ బాస్ విన్నర్.. గ్రాండ్‌గా ఓపెనింగ్..

ఆషాఢ మాసం పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నెల 21న గురు పూర్ణిమ.. వేద వ్యాసుడు గురు పౌర్ణమి రోజున జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. సమస్త మానవాళికి వేదాలను బోధించడం ఆయనతోనే ప్రారంభమైనందున వ్యాస మహర్షిని ఆది గురువుగా పూజిస్తారు. గురువు అనుగ్రహం ప్రసాదించాలనే ఉద్దేశ్యంతో ఇవ్యాల గురు బ్రహ్మలను పూజిస్తారు. ఇది సంపద మరియు శాంతిని కలిగిస్తుందని నమ్ముతారు. వేదాలలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూ సంప్రదాయాల ప్రకారం.. గురువును దేవుడి కంటే ఉన్నతంగా పూజిస్తారు. వేదవ్యాసుడు బోధించేటప్పుడు.. వినాయకుడు మహాభారతాన్ని రచించాడని ప్రతీతి.

Read also: Uttar Pradesh : భర్త వేరే కలర్ లిప్ స్టిక్ తెచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య

గురు పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలం వెళితే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి రోజున అరుణాచలం గిరి ప్రదర్శన అత్యంత ముఖ్యమైనది. ఉదాహరణకు- గురు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణం చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి అరుణాచల్‌కు భక్తులు పోటెత్తారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి అరుణాచల్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అలాగే- ప్యాకేజీ ట్రిప్పులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి బయలుదేరుతాయి. ఈ నెల 19 నుంచి 22 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్యాకేజీ ట్రిప్‌లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం, శ్రీపురంలోని స్వర్ణ దేవాలయాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ కోసం భక్తులు http://tsrtconline.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Weather Alert: నేడు పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం..!

Show comments