TG Govt Stop Cellars: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరంలో చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే నగరంలో సెల్లార్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని భావిస్తున్నారు. బహుళ అంతస్తుల వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెల్లార్లపై ఫిర్యాదులు, వర్షపునీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలు కురిసినా సెల్లార్లలో నిలిచిన నీటిని మోటార్లతో తోడుకోవాల్సి వస్తోంది. సెల్లార్ల కోసం చాలా లోతుగా తవ్వడం వల్ల వచ్చే మట్టి కూడా సమస్యగా మారింది. ఇది ఇళ్ల నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతోంది. ప్రస్తుతం, బహుళ అంతస్తుల నిర్మాణాలలో ఐదు లేదా ఆరు సెల్లార్లకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే.. గతంలో హైదరాబాద్‌లో భూకంప ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. అక్కడ సెల్లార్ల నిర్మాణం చాలా ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సెల్లార్లకే.. అనుమతి ఇవ్వకుంటే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read also: Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి.. వాటాను 50% పెంచండి..
భవనాల్లో పార్కింగ్ చేసేందుకు సెల్లార్ల స్థానంలో స్టిల్ట్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు డిజైన్‌లో మార్పులు చేస్తున్నారు. ఎన్ని అంతస్తుల స్టిల్ట్ నిర్మాణాలకైనా అనుమతి ఇవ్వవచ్చని వివరించారు. ఈ సందర్భంగా నిర్మాణ ఎత్తులో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ తరహా నిర్మాణాలకు అనుమతిచ్చినట్లు ఓ టౌన్ ప్లానింగ్ అధికారి తెలిపారు. 2 నుంచి 3 స్టిల్ట్‌లకు అనుమతి ఉందని, ఇళ్లు నిర్మించే వారు సానుకూలంగా ఉన్నప్పటికీ వాణిజ్య భవనాలు నిర్మించేవారు వీటిపై ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. కమర్షియల్ నిర్మాణాలలో గ్రౌండ్ ఫ్లోర్‌కు చాలా డిమాండ్ ఉంది. ఆ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే నష్టమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చట్టంలో సవరణలు చేయడం ద్వారానే దీని అమలు సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. త్వరలో దీనిపై అధికార ప్రకటన రానున్నట్లు సమాచారం.
Bhadrachalam Godavari: భద్రాచలం వద్ద మరోసారి విజృంభిస్తున్న గోదావరి..