NTV Telugu Site icon

TG DSC Hall Tickets: డీఎస్సీ విద్యార్థులు అలర్ట్.. నేడు హాల్‌ టికెట్లు విడుదల..

Tg Dsc Hall Tickets

Tg Dsc Hall Tickets

TG DSC Hall Tickets: తెలంగాణ DSC రాసే అభ్యర్థులకు అలర్ట్. ఈరోజు సాయంత్రం నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. డీఎస్సీ హాల్ టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ.. నేడు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనుంది. సీబీటీ ఆధారిత పరీక్షను ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షలు సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.

Read also: Realme Narzo 70 Offer: రియల్‌మీ నార్జో 70పై భారీ తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఈ ఒక్క రోజే!

ఇదీ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్.

* మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష జూలై 18న
* జూలై 18న రెండవ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
* జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 20న SGT, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
* జూలై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
* జూలై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 24న స్కూల్ అసిస్టెంట్- బయోలాజికల్ సైన్స్ పరీక్ష
* జూలై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

Read also: Anant Radhika Wedding : 610 మంది కమాండోలు, కోట్ల విలువైన వాచీలు… అనంత్ వెడ్డింగ్‌లో వీవీఐపీలకు స్పెషల్ ఏర్పాట్లు

మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే విద్యాశాఖను సీజ్ చేసి మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. డీఎస్సీని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అన్నారు. కోచింగ్ సెంటర్ల యజమానులు తమ వ్యాపారం కోసం పరీక్షలను వాయిదా వేయాలని తనను సంప్రదించారని తెలిపారు. విద్యార్థుల మృతితో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Pakistan : తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని మహిళ ముక్కు కోసిన కిరాతకుడు