Site icon NTV Telugu

Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. ఇంటి ముందు కూర్చున్న గాంధీ..

Koushik Reddy's Residence

Koushik Reddy's Residence

Arekapudi Gandhi: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముందే ప్రకటించిన మాదిరిగా తన అనుచరులతో కలిసి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకున్నారు. గాంధీని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఆయన పై కోడుగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంట్లో పనిచేసే ఆడవారికి గాయాలు అయ్యాయి. పలువురు మీడియా ప్రతినిధుకు కూడా గాయపడ్డారు. సవాళ్లు, ప్రతి సవాళ్ళతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరికి వారు తమ ప్రతాపం చూపించారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎక్కడ చూసినా పగిలిన కోడిగుడ్లు, టమాటాలు దర్శనమిచ్చాయి. అయితే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద గాంధీ ధర్నాకు కూర్చున్నారు. కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలి నేను ఇక్కడే ఉంటా అంటూ గాంధీ సవాల్ చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

Exit mobile version