తెలంగాణ టెట్ పలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి విడుదల చేశారు. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అర్హత సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం 04-11-2024న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక పరీక్షలు 02-01-2025 నుంచి 20-01-2025 తేదీల మధ్య ఇరవై సెషన్‌లలో ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించారు. మొత్తం 275753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1లో ఎనిమిది సెషన్‌లలో 7 భాషల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీలో నిర్వహించారు. ఇక పేపర్-2 పన్నెండు సెషన్‌లలో నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Amit Shah : ఉగ్రవాదంపై పోరాటాన్ని తీవ్రతరం చేయండి… జమ్మూ కాశ్మీర్ భద్రతా సంస్థలకు అమిత్ షా సూచనలు