NTV Telugu Site icon

TG Police Dept: తెలంగాణ పోలీస్ సంచలన నిర్ణయం.. ట్రాఫిక్ విధుల్లో 44 మంది ట్రాన్స్ జెండర్లు

Traffic

Traffic

TG Police Dept: హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్లో ట్రాన్స్ జెండర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలెక్షన్స్ జరిగాయి. గోశామహల్ స్టేడియంలో ట్రాన్స్ జెండర్స్ కి ఈవెంట్స్ నిర్వహించిన అధికారులు.. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ లో అధికారులు నియమించనున్నారు. ఈరోజు ఈవెంట్స్ లో పాల్గొన్న 58 మంది ట్రాన్స్ జెండర్స్ ఉండగా.. 29 మంది ఉమెన్స్, 15 మంది మెన్ ట్రాన్స్ జెండర్ అభ్యర్థుల ఎంపిక అయ్యారు.

Read Also: Kadambari Jethwani Case: ముంబై నటి జత్వాని కేసులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..

కాగా, మొత్తం 44 మందిని ఈవెంట్స్ తర్వాత అధికారులు సెలెక్ట్ చేశారు. 800 మిటర్స్ రన్నింగ్, 100 మిటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. 18 ఏళ్లు పూర్తైన వారు.. 10వ తరగతి సర్టిఫికెట్స్, ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఆధారంగా అభ్యర్థులకు అధికారులు ఈవెంట్స్ నిర్వహించారు. ఇక, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది.. సిటీలో 85 లక్షల వాహనాలు ఉన్నాయి.. రోజుకు 1500 వాహనాలు కొత్తగా వస్తున్నాయి.. ట్రాఫిక్ సమస్య నివారించేందుకు ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. మలక్ పేట్ నుంచి గోల్కొండ వరకు నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై చర్చించామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

Show comments