Site icon NTV Telugu

Pawan Kalyan: తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం రద్దు..! 336 వార్డుల్లో జనసేన పోటీ..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన రద్దు అయ్యింది.. ఎల్లుండి నల్గొండలో బీజేపీ తరఫున మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారని ముందే ప్రకటించింది తెలంగాణ బీజేపీ.. అయితే, తాజాగా పవన్‌ పర్యటన రద్దు అయినట్టు వెల్లడించింది.. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. వ్యక్తిగత కారణాలతో పవన్‌ పర్యటన రద్దయ్యిందని ప్రకటించింది బీజేపీ..

Read Also: AP High Court: ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఎస్పీకి కీలక ఆదేశాలు

ఇక, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.. ఈ నెల 11వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 336 వార్డుల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.. ఇందుకు సంబంధించి పార్టీ అభ్యర్థుల B-ఫారమ్‌లు దాఖలు చేయగా, స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారని పార్టీ వెల్లడించింది..

జిల్లాల వారీగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య
నిజామాబాద్ – 48
కొత్తగూడెం – 22
రంగారెడ్డి – 21
ఖమ్మం – 17
వరంగల్ – 20
నల్గొండ – 46
మహబూబ్‌నగర్ – 44
మహబూబాబాద్ – 5
మెదక్ – 18
కరీంనగర్ – 56
ఆదిలాబాద్ – 39
మొత్తం వార్డులు: 336

Exit mobile version