Site icon NTV Telugu

Telangana High Court: సిగాచీ పేలుళ్ల ఘటన… పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

Telangana High Court

Telangana High Court

Telangana High Court: సిగాచీ పేలుళ్ల ఘటనపై పోలీసులు చేపట్టిన దర్యాప్తు పట్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని, ఒకేసారి 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన దారుణం అని సీఎస్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఇదేనా దర్యాప్తు? 5 నెలలు గడిచినా పురోగతి ఏమీ లేదు” అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది అంటే మాటలు ఏమిటి?.. ఇంత పెద్ద ప్రమాదంలో బాధ్యత ఎవరికో ఇప్పటికీ నిర్ధారణ కాలేదా? అంటూ ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది.

Read Also: Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్‌.. ‘దిత్వా’గా నామకరణం.. ఏపీకి భారీ వర్ష సూచన..

DSP కి దర్యాప్తు ఎందుకు? SIT ఎందుకు కాదు?
ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాల్సిందిగా కోర్టు వ్యాఖ్యానించింది. 54 మంది చనిపోయినా.. DSP స్థాయి అధికారి దర్యాప్తు చేయడం ఎలా సమంజసం?” అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, ఇది అత్యంత తీవ్రమైన నిర్లక్ష్యం అని ప్రజాప్రయోజన వ్యాజ్య పిటిషనర్ బాబు రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 237 మందిని విచారించినా దర్యాప్తులో పురోగతి లేదు.. నిపుణుల కమిటీ పరిశీలనలో ఫ్యాక్టరీ నిర్వహణలో ఘోర లోపాలు తేలాయి.. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారు.. పేలుడు తీవ్రతకు 8 మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని గుర్తు చేసింది..

ప్రభుత్వ వైఖరిపై కోర్టు ప్రశ్నలు
ఏఏజీ ప్రభుత్వం నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని కోర్టుకు తెలియజేశారు. దానికి కోర్టు స్పందిస్తూ ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం సరిపోదు అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. దర్యాప్తు నివేదికను వెంటనే సమర్పించాలి.. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి DSP స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్‌ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు..

Exit mobile version