NTV Telugu Site icon

Supreme Court: నేడు సుప్రీం కోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసు విచారణ..

Supremcourt

Supremcourt

Supreme Court: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో-29 రద్దు చేయాలని పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో వల్ల తాము నష్టపోతున్నామని రాంబాబు ఈ నెల 17న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది మోహిత్‌రావు ఈ నెల 18న ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేయలేమని, సోమవారం విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి జరుగుతుందని రాష్రప్రభుత్వం చెప్పడం, అధికారులు ఏర్పాటు పూర్తి చేయడం గమనార్హం. విద్యార్థుల ఆందోళనకు, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు మధ్య కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Astrology: అక్టోబర్ 21, ఆదివారం దినఫలాలు