Tummala Nageswara Rao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సన్న ధాన్యం పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వమని స్పష్టం చేశారు. రూ.25 వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పంట వేయని భూములకు ఇచ్చిందన్నారు. రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తామన్నారు. మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తామని క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు.
Read also: Musi River: గోదావరి నీళ్లను మూసిలోకి తేవాలని ప్రయత్నం చేశాము: కేటీఆర్
42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 42 లక్షల లబ్ధిదారులకు, 25 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్లు అవసరం అని.. 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15ననే చేశామన్నారు. 20 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందని తెలిపారు. 2 లక్షల పైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబర్ లో కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా రుణమాఫీ చేస్తాం. 2500కోట్ల రూపాయలు వేస్తామన్నారు. రుణ విముక్తి కావాలంటే కొత్త రుణాలు రావన్నారు. రూ.2 లక్షల పైన ఉన్న రుణాల వారి అంశం క్యాబినెట్ లో చర్చిస్తామన్నారు. పంటల భీమా గతంలో లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతీ రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో పండే అన్ని పంటలను ఎంఎస్పీ ప్రకారమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అన్ని పంటలను కేంద్రం కొనుగోలు చేయాలి.. ఇప్పటి వరకు 20% కేంద్రం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
MLC Kavitha: నేడు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..