NTV Telugu Site icon

Telangana Govt: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Rtc

Rtc

Telangana Govt: టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక, 2.5 శాతం డీఏను రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక, రేపు మహిళా దినోత్సవం నుంచి ఇది అమలులోకి వస్తుందని అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఆడబిడ్డల అభివృద్ధే తెలంగాణ ప్రగతిగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం కానున్నాయి.

Read Also: IND vs NZ Final 2025: ఫైనల్లో వాళ్లిద్దరిని ఆపకపోతే భారత్కు దబిడి దిబిడే..

అయితే, మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలోకి తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. తరువాత దశలో 450 బస్సులు మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకున్నారు. రేపు ఈ బస్సులను లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.