TG Congress Protest: రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మరొకసారి దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ ‘‘బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్’’ నిర్వహించాలని పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ సర్క్యులర్ జారీ చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నిరసన చేపట్టనుంది.
Read also: TG Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 30న కేబినెట్ భేటీ..
ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ లకడికాపూల్ (పాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం) భారీ ప్రదర్శన చేయనుంది. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మార్చ్ ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా మెజిస్ట్రేట్లకు మెమొరాండం సమర్పించేంత వరకూ మార్చ్ కొనసాగించనున్నారు. ఈ నిరసనలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పెరేషన్ చైర్మన్ లు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ నాయకులుపాల్గొంటారు. హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
Read also: YS Jagan: నేడు కడపకు వైఎస్ జగన్.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
కాగా.. డిసెంబర్ 18న రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ఒక ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. దేవుడి పేరు పదే పదే తలుచుకుంటే కనీసం స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంబేద్కర్‌ను అమమానించినందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆరోపించారు. ఇరువర్గాల వారు పార్లమెంటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.
KBR Park: కేబీఆర్ పార్క్‌కు వెళ్లాలంటే నెలకు రూ.1000 కట్టాల్సిందే..