Telangana CMO: మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం.. దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..
- కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ సీఎంవో నోట్ విడుదల..
- తొలి ఏడాదిలోనే అర లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ..
- ఏడాది పొడవునా జాబ్ మేళా..
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం..
- దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CMO: కాంగ్రెస్ ప్రజా పాలనపై తెలంగాణ సీఎంవో నోట్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసిందని పేర్కొంది. ప్రజా పాలనలో తెలంగాణ యువత భవిత మలుపు తిరిగిందని, తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించిందని తెలిపింది.
తెలంగాణ సీఎంవో నోట్..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
* ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసిందని పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి ఏడాదిలోనే 53 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది.
* గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీ లేక విసిగి వేసారిన నిరుద్యోగుల జీవితాల్లో సరికొత్త మార్పు తెచ్చింది.అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు. అప్పటివరకు పెండింగ్ లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం తొలిగించిందని తెలిపింది.
* పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాలకు వయో పరిమితిని సడలించింది.
* గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయినవి.. వాయిదా పడ్డవి.. పెండింగ్ లో పెట్టిన ఫలితాలన్నింటినీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది.
* దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
* బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే… కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది.
* జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. వీరిలో 10006 మంది ఉద్యోగాల్లో చేరారు.
Read also: RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం.. 600 మంది నుండి రూ.150 కోట్లు వసూలు..
* రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం 8,304 మందికి నియామక పత్రాలను అందించింది.
* పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
* షెడ్యూలు ప్రకారం నవంబర్ లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
* టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఈ ఏడాదిలో 3,393 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు, రవాణా శాఖ పరిధిలో 96 మంది ఏఎంవీఐలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారు.
* గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 తుది ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 8143 మంది ఎంపికైన అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వం తొలి విజయోత్సవాల సందర్భంగా నియామక పత్రాలు అందించనుంది.
* పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు ఉన్న అడ్డంకులన్నింటీనీ ప్రభుత్వం అధిగమించింది. ఎంపికైన 16067 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది.
* మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్వర్యంలో 7094 మంది స్టాఫ్ నర్స్ ల నియామకాలు విజయవంతంగా పూర్తి చేసింది. వీరిలో 6956 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది.
* ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నిషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మొత్తం 5378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని నోట్ లో పేర్కొంది.
Naga Chaitanya : నాగచైతన్య నెక్ట్స్ మూవీ బడ్జెట్ అంతనా.. నోరెళ్ల బెడుతున్న ఫ్యాన్స్
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!