Site icon NTV Telugu

Civil Supplies Department: డిజిటల్ హెల్త్ కార్డుల ఫార్మేట్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు

Civil Supplies Department

Civil Supplies Department

Civil Supplies Department: డిజిటల్ హెల్త్ కార్డుల కోసం తెలుగు దరఖాస్తుల ఫార్మేట్ ను ప్రభుత్వం విడుదల చేయలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్‌ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న తెలుగు దరఖాస్తులకు ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు కమిషనర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డు డిజైన్‌ ఇప్పటి వరకు ఫైనల్‌ కాలేదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియా, పలు మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రభుత్వంతో సంబంధ లేదని తేల్చి చెప్పింది. ఫేక్‌ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాంటి తప్పుడు వార్తలపై ప్రజలు స్పందించవద్దని పేర్కొంది. ఇలాంటి ఫేక్‌ వార్తలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Mallu Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Exit mobile version