NTV Telugu Site icon

Telangana Assembly: 23 నుంచి అసెంబ్లీ భేటీ.. 25న బడ్జెట్..

Telangna Asembly

Telangna Asembly

Telangana Assembly: రాష్ట్ర శాసనసభ మూడో సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్య గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 23న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత, ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపి సభ తొలిరోజు వాయిదా పడింది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమై సాధారణ కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉంది.

Read also: Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!

అలాగే రాష్ట్ర వార్షిక (2024-25) బడ్జెట్‌ను ప్రభుత్వం 25న ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 26న అసెంబ్లీ సమావేశాలు వాయిదా, 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ జరగనుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ సభ వాయిదా పడి ఈ నెల 30 నుంచి మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నెల 23న స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. గత అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. కానీ, తాజాగా ఆయన ఈసారి సమావేశాలకు హాజరవుతానని ప్రకటించడంతో రానున్న సమావేశాలపై ఆసక్తి నెలకొంది. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వలసలు ఎక్కువగా ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ ఫిరాయింపు చట్టంపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
Rajanna Sircilla: మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్.. వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు..

Show comments