Site icon NTV Telugu

Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల

Tg

Tg

Telangana: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల అయింది. సెప్టెంబర్‌ 29 (సోమవారం)వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. అయితే, 29వ తేదీన పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్లతో వాదిస్తారు. ఇక, అక్టోబర్ 1వ తేదీన ఫిర్యాదుదారు అడ్వకేట్స్ తో పాటు పార్టీ మారిన లాయర్లతో వాదిస్తారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ, మధ్యాహ్నం 3గంటలకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డిలు విచారణకు హాజరుకానున్నారు.

Read Also: CPI Narayana: ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా కామ్రేడ్ నారాయణ

అయితే, అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ దశలో న్యాయవాదులు కీలక వాదనలు వినిపించనున్నారు. అక్టోబర్‌ 1 (బుధవారం)వ తేదీన మరోసారి అదే కేసులపై విచారణలు కొనసాగనున్నాయి. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు వినిపిస్తారు. స్పీకర్‌/చైర్మన్‌ ఆధ్వర్యంలో 10 షెడ్యూల్‌ ప్రకారం విచారణ జరపనున్నారు.

బీఆర్ఎస్ అడ్వకేట్స్ వర్సెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లు..
• కల్వకుంట్ల సంజయ్‌ వర్సెస్‌ T. ప్రకాశ్‌ గౌడ్
• చింత ప్రభాకర్ వర్సెస్‌ కేల యాదయ్య
• చింత ప్రభాకర్ వర్సెస్‌ గుడెం మహిపాల్‌ రెడ్డి
• పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్‌ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

Exit mobile version