NTV Telugu Site icon

Wife Vs Husband: పబ్బుకు పోయి ఇరుక్కున్న భర్త.. ఇంటికి రా నీ సంగతి చెప్తా..

Wife Vs Husband

Wife Vs Husband

Wife Vs Husband: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని టాస్‌ పబ్బుపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 142 మందిని అదుపులో తీసుకుని స్టేషన్‌ కు తరలించారు పోలీసులు. అరెస్ట్‌ అయిన వారిలో 100 మంది పురుషులు కాగా.. 42 మంది అమ్మాయిలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వీరందరూ అరెస్ట్‌ కావడంతో వీరికోసం బంధువులు, స్నేహితులు పోలీస్టేషన్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదంతా బాగానే వున్నా.. 100 మందిలో తన భర్త కూడా వున్నాడనే వార్త వినగానే భార్య ఆవేశంతో ఊగిపోయింది. తన భర్త కోసం ఆధార్‌ కార్డు తీసుకుని పోలీస్టేషన్‌ వద్దకు చేరుకున్న భార్య ఆగ్రహంతో రెచ్చిపోయింది. భర్తపై నిప్పులు చెరిగింది. బయటకు వెళతా అని చెప్పి పబ్‌ కు వెళతావా? అంటూ ఆవేశంతో ఊగిపోయింది. బయటకు వెళ్తున్న అని చెప్పి పబ్ కి వచ్చి తందనాలు ఆడుతున్నాడని మండిపడింది. రా బయటికి అంటూ పోలీస్టేషన్‌ వద్ద రచ్చ రచ్చ చేసింది. నువ్వ రా ఇంటికి సంగతి చెప్తా అంటూ ఆగ్రహంతో రెచ్చిపోయింది. అయితే అప్పటికే పోలీసుల అదుపులో వున్న భర్త, అక్కడే వున్న వారందరూ చూస్తూ ఉండిపోయారు. పోలీసులు భర్తను బయటకు పంపడం ఏమో గానీ.. భర్త ఇంటికి వెళ్లిన తరువాత పరిస్థితి ఏంటని అక్కడ వున్న వారందరూ నవ్వుకున్నారు. పోలీసుల అదుపులో వున్న భర్త.. భార్య ఆవేశాన్ని చూస్తూ బిక్కు బిక్కు మంటూ.. ఉండిపోయాడు.

Live : Taskforce Raids on Pubs in Banjara hills.. 100 మంది పురుషులతో పాటు 40 మంది మహిళలని.! | Ntv

Revanth Reddy Vs Harish Rao: నిన్న హరీష్ రావు కామెంట్స్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్