NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు

Hyd

Hyd

ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇవాళ (బుధవారం) జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు అంత సిద్ధం చేశారు. స్టేడియంలో ముంబై ఇండియన్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య నేటి సాయంత్రం 7. 30 గంటలకు మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా, స్టేడియంలో 2800 మంది సిబ్బందితో భద్రత, 360 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్‌ జోషి పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా మ్యాచ్‌ సమయంలో భారీ వాహనాలను నియంత్రించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, మ్యాచ్‌కు మూడు గంటల ముందు నుంచే స్టేడియంలోకి పర్మిషన్ ఇస్తామన్నారు. భద్రతలో భాగంగా ప్రేక్షకులు తమ వాహనాలను నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే పార్కింగ్‌ చేయాలన్నారు. బ్లాక్‌లో టికెట్స్‌ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు.

Read Also: Ram Charan Birthday : మెగాపవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్ .. రామ్ చరణ్ సినీ ప్రస్థానం..

అలాగే, ఉప్పల్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా నేటి సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బోడుప్పల్‌, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండీఏ భగాయత్‌ లే అవుట్‌ ద్వారా నాగోల్‌ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.. అలాగే, నాగోల్‌ నుంచి వచ్చే వాహనాలు మెట్రోస్టేషన్‌ నుంచి యూ టర్న్‌ తీసుకొని, భగాయత్‌ లేఅవుట్‌ నుంచి వెళ్లాలని సూచించారు. తార్నాక నుంచి వచ్చే వెహికిల్స్ హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం వైపు మళ్లించనున్నట్ల చెప్పారు. ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

Read Also: Prabhas : ఫారిన్ లో ప్రభాస్ కొత్త ఇల్లు.. ఏంటి అదంతా నిజమా డార్లింగ్ ?

ఇక, మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు షార్ప్‌ మెటల్స్‌, బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ల్యాప్‌టాప్‌, వాటర్‌బాటిల్స్‌, బ్యానర్స్‌, లైటర్స్‌, సిగరేట్స్‌, బైనాక్యులర్స్‌, హెల్మెట్లు, ఫర్‌ప్యూమ్స్‌, ఫుడ్‌ ఐటమ్స్‌, తదితర వస్తువులను స్టేడియంలోకి తీసుకు రావొద్దని పోలీసులు తెలిపారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత పోలీసులు సూచించిన విధంగా ప్రేక్షకులు వెళ్లాలని పేర్కొన్నారు. మ్యాచ్‌ మధ్యలో స్టేడియంలోకి ఎవరూ రావొద్దన్నారు. ఉప్పల్‌ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. 39 వేల మంది సామర్థ్యం కలిగిన స్టేడియంలో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేయగా.. మెట్రోరైలు సమయాన్ని పొడిగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.