NTV Telugu Site icon

SOT Police Raid: కోహినూరు సంస్థలో ఎస్ఓటి సోదాలు.. అదుపులో సంస్థ యజమాని..

Kohinoor Sot Raids

Kohinoor Sot Raids

SOT Police Raid: హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని కోహినూరు సంస్థలో ఎస్ఓటి సోదాలు నిర్వహించారు. కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై ఎస్ఓటి దాడులు చేపట్టారు. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. కోహినూరు సంస్థ ముడి సరుకులతో పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోహినూరు సంస్థ యజమాని గజేందర్ సింగ్ ను ఎస్ఓటి అదుపులో తీసుకున్నారు. సుమారు 300 కేజీల పన్నీరు స్కిమ్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్ తో కళాఖన్ స్వీటు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వనస్పతి, పామాయిల్ తో కలిపి కళాకాన్ , పన్నీరు పాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తుల కోసం పెద్ద ఎత్తున నిల్వచేసిన ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్‌లతో బేగంబజార్ సెంటర్‌లోని పలు టీ స్టాళ్లు, 50 హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌హౌస్‌లకు గజేందర్‌సింగ్ అనే వ్యాపారి ఈ నకిలీ పాలను సరఫరా చేస్తున్నాడు. పాలతో పాటు పెరుగు, వెన్న, ఐస్‌క్రీం కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుసుకున్న SWOT పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Read also: Maoist Leader: మవోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో రూ.కోటి రివార్డు వున్న అగ్రనేత..

ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీతో పాటు ఇతర సహకార, ప్రైవేట్ డెయిరీలు తరచూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాయి. పేరున్న కంపెనీల పేరుతో ప్యాకెట్లు సృష్టించి నకిలీ పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. విజయ డెయిరీ పేరుతో కొన్ని నకిలీ కంపెనీలు పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని ఆ సంస్థ ఐదారుసార్లు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఏయే సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయో స్పష్టంగా పేర్కొన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోపాటు యథేచ్ఛగా నకిలీ దందా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు, రాజధాని పరిసర జిల్లాల్లో ఈ నకిలీ దందా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఈ నకిలీ దందా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నకిలీ మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ల కోసం రెక్లా షెడ్లను యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్నారు.


KTR Viral Tweet: పైసా పనిలేదు రాష్ట్రానికి లాభం లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు..