NTV Telugu Site icon

Seetharama Project: రైతులకు పండగే.. పంద్రాగస్టు రోజు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం..

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Seetharama Project: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీంతో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించారు.

Read also: Glass Tube Center : రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కలలు సాకారమయ్యే రోజు వచ్చిందని ఉత్తమ్ అన్నారు. మొదటి పంప్ హౌస్ ట్రయల్ రన్‌ను గత జూన్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల రెండో తేదీన రెండో పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దశాబ్దాల కల సాకారమవుతోందన్నారు. ఇకపై రైతుల కష్టాలు తొలగిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. రైతుల కళ్లలో ఆనందం చూడడమే తన లక్ష్యమని వెల్లడించారు.

Read also: Iran Israel War : ఇజ్రాయెల్‌ ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. 29 మంది ఉరి

సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈనెల 11న ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రాజెక్టులోని రెండో పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ నిర్వహిస్తారు. మూడో పంపు ట్రయల్ రన్ పూర్తి చేసిన అనంతరం వైరాలో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభను మంత్రి ఉత్తమ్ పరిశీలించనున్నారు. అనంతరం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దున్నపోతుల గండి వద్ద ప్రతిపాదిత ఎత్తిపోతల పథకం స్థలాన్ని పరిశీలించనున్నారు. స్థల పరిశీలన అనంతరం మిర్యాలగూడలో నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారు.
Tollywood Producer: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఇంట్లో తీవ్ర విషాదం!

Show comments