NTV Telugu Site icon

R.S.Praveen Kumar: తెలంగాణపై ఢిల్లీ నుండి కుట్ర.. ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

Rs Praveen Kumar

Rs Praveen Kumar

R.S.Praveen Kumar: తెలంగాణపై ఢిల్లీ నుండి కుట్ర జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి బిఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యుద్ధ భూమిగా ఉండేదన్నారు. వరంగల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా నేను జయశంకర్ ను కలిశానని తెలిపారు.

Read also: Fishermens Arrest: శ్రీలంక నేవీ అదుపులో 22 మంది తమిళ మత్స్యకారులు..

తెలంగాణలో ఎన్ కౌంటర్లు లేకుండా నక్సలిజం సమస్యకు పరిష్కారం చూపాలని అడిగానని అన్నారు. ఆంధ్రా పోలీసులు తెలంగాణ పోలీసులను ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జయశంకర్ పోలీసులకు దిశానిర్దేశం చేశారన్నారు. తెలంగాణ మళ్లీ ప్రమాదం అంచున ఉందన్నారు. దొడ్డిదారిన తెలంగాణ వనరులను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అమెరికాలో మీటింగ్ పెడితే అంతా ఆంధ్రా వారు వచ్చారని కీలక వ్యాక్యలు చేశారు. తెలంగాణపై ఢిల్లీ నుండి కుట్ర జరిగే అవకాశం ఉందన్నారు. అదృశ్య శక్తులు తెలంగాణను కబలించే అవకాశం ఉందన్నారు.
Warangal Farmers News: రుణాల రెన్యువల్ కోసం రైతుల ఇక్కట్లు.. బ్యాంక్ ల ముందు క్యూ..

Show comments