NTV Telugu Site icon

KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై కేటీఆర్ ట్వీట్ వైరల్..

Ktr

Ktr

KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి అని, తెలంగాణలో బుల్డోజర్ రాజ్‌ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..? రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందన్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..! పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే..అన్నదాత వెన్ను విరవడమే..! అన్నారు. రైతు ద్రోహి కాంగ్రెస్..చరిత్ర నిండా అనేక రుజువులు..ఇప్పుడు ఇంకొకటి ! అంటూ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు.

Read also: Hyderabad Crime: బాచుపల్లిలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

జీఎస్టీపై కేటీఆర్ మరో ట్విట్..

తెలంగాణలో బుల్డోజర్ రాజ్‌ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయ్ అని తెలిపారు. గతేడాది తో పోల్చుకుంటే తొలిసారిగా తెలంగాణ లో జీఎస్టీ వసూళ్లు 1 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. GST వసూళ్లలో తెలంగాణ ఎప్పుడు కనీసం 15 శాతం వృద్ధిని సాధించేదన్నారు. తెలంగాణ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో విజయవంతంగా పోటీపడుతోందని అన్నారు. విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచి అనూహ్యమైన ఘనతను సాధించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తూ గొప్పగా ఫలితాలనిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ వంటి సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరం అని తెలిపారు. ఈ తిరోగమన పరిస్థితి పై సీఎం సమాధానం చెబుతారని ఆశిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.


Telangana Ministers: నేడు దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన..

Show comments