Robert Vadra: రాబర్ట్ వాద్రా ఈరోజు హైదరాబాద్ రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాబర్ట్ వాద్రా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి రాబర్ట్ వాద్రా భర్త. ఈరోజు సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆయన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని దేవాలయాలు, మసీదులను సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పెద్దతల్లి ఆలయాన్ని, బంజారాహిల్స్‌లోని మజీద్‌ను రాబర్ట్ వాద్రా సందర్శించనున్నారు.
Read also: Dengue Fever: జిల్లాలో డెంగ్యూ జ్వరాలు.. రెండు నెలల్లో 714 కేసులు
అయితే రాబర్ట్ వాద్రా ఏదైనా వ్యాపారంపై రాష్ట్రానికి వస్తారా? లేక ఏదైనా రాజకీయ ఉద్దేశ్యంతో రాష్ట్రంలోకి ప్రవేశిస్తారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గాంధీకి కంచుకోట అయిన అమేథీ నుంచి వాద్రా ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ, ఎట్టకేలకు రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే.
Read also: CM Biren Singh: “రాజీనామా ప్రసక్తే లేదు.. వచ్చే ఆరు నెలల్లో మణిపూర్ లో శాంతి ఖాయం!”
మరోవైపు యూపీఏ హయాంలో రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎల్ఎఫ్ భూ కుంభకోణం, బికనీర్ భూ కుంభకోణం, రూ.9600 కోట్ల కర్ణాటక లోయకుంట ఇలా ఎన్నో కుంభకోణాలకు పాల్పడిన రాబర్ట్ వాద్రా తెలంగాణ పర్యటన వెనుక రహస్యం ఏంటి? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్తారని భావిస్తున్నారా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే.. ఢిల్లీకే పరిమితమైన వాద్రా ఇప్పుడు రాష్ట్రానికి రావడానికి గల కారణాలపై ప్రస్తుత రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
6 Balls 6 Fours: ఒకే ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..